ప్రేమంటే కెమిస్ట్రీ , సినిమా అంటే ఫిజిక్స్. రెండూ కలిస్తే మిస్టరీ. సినిమా ప్రేమలు మనకంత సులభంగా అర్థం కావు. అయినా సరే, బాల్యంలోనే సినిమాలు చూడ్డంవల్ల ప్రేమకు 11 ఫార్ములాలు కనిపెట్టాను.
1. విలన్ వెంటాడుతున్నప్పుడు, అమ్మాయిని కాపాడాలి (నిజ జీవితంలో విలన్లు కూడా హీరో రూపంలో వుంటారు. ఇదో కన్ఫ్యూజన్).
2. అమ్మాయి వెళుతున్నప్పుడు పనీపాటా లేని ఒక పాము ఎదురవుతుంది. కరవకపోయిన ఆమె అరుస్తుంది. మనం వెళ్లి పాముని విసిరేయాలి. కృతజ్ఞతాభారంతో తప్పనిసరై ప్రేమిస్తుంది.
3. ఈ గోలేమీ లేకుండా అమ్మాయిని చూసినప్పుడు రేచీకటి వచ్చినవాడిలా నాలుగుసార్లు కళ్లార్పాలి, ఆమె కూడా రిపీట్ చేస్తుంది. వాద్యాల వాళ్లంతా మోత మోగిస్తారు. పాట పాడుకుంటే అదే ప్రేమ.
4. కాలేజ్ లో లెక్చరర్ ని ఆట పట్టించాలి, రాగింగ్ చేయాలి లేదా ర్యాగింగ్ చేయించుకోవాలి. ఎట్లాగూ మన పక్కన ఇద్దరు వెధవలు ఉంటారు వాళ్ళతో కామెడీ చేయించాలి .
5. దీపావళి రోజున బయట రోడ్ల పై తిరగాలి, ఎక్కడ మతాబులు కాల్చిన ఆ వెళుతుర్ని కళ్ళు ఆర్పకుండా చూడాలి, లేకుంటే అమ్మాయి మిస్ అవుతుంది.
6. ఎక్కాడాఆఆఆఆఆఆ, ఎప్పుడూఊఊఊఊఓ లాంటి వింతగా పలకదానికి, రాయడానికి వీలు లేని పదాలు పలికే అమ్మాయిలు పడడం చాలా వీజీ.
7. మటన్ షాప్ లో పని చేసిన అనుభవం ఉంటే చాలా మంచిది. అమ్మాయి తండ్రిని / అన్నయ్యల్ని వారి చుట్టూ ఉండే చంచాలని వీజీ గా నరకవచ్చు, దాంతో అమ్మాయి లవ్ చేయవచ్చు .
8. ట్రేన్ లో ప్రయాణించెప్పుడు సర్టిఫికేట్స్ పడేయండి, అవి పోస్ట్ లో తిరిగి వచాయా ఇక అంతే మీ ప్రేమ పండినట్టే.
9. కేరళ వెళ్ళి కాలేజ్ లో చదువుకొండి. ప్రేమలో పదండి కానీ అక్కడోళ్లు కలర్ లుంగీలు , కత్తులు వేసుకుని నరకదానికి వస్తే బయపడవద్దు.
10. మీ ఇంటి పైన పోర్షన్ అద్దెకి ఇప్పించండి , ఇంటి గేట్ మాత్రం ఇనుప గేట్ పెట్టించండి, సౌండ్ మాత్రం ఎక్కవగా రావాలి.
11. గీతార్ వేసుకుని బస్ ల్లో , ట్రేన్ ల్లో తిరగండి, సాంగ్స్ పాడండి. చిల్లర కి చిల్లర …ప్రేమ కి ప్రేమ.
పాత సినిమాలు చూసిన వాళ్ళంతా ప్రేమ ఇలాగే పుడుతుందని నమ్మారు. నమ్మకం వేరు, నిజం వేరు అనేది తర్వాత అర్థమవుతుంది. ప్రేమ విషయంలో ఎన్టీఆర్ ఫాస్ట్. మొదటి రెండు రీళ్ళలోనే హీరోయిన్ని కౌగిల్లోకి లాక్కుంటాడు. కృష్ణదిఅదోటైపు. ప్రేమ, కోపం, విరహం అన్నింటినీ ఒక్కలాగే రిసీవ్ చేసుకుంటాడు. లవ్ కంటే విలన్లని ఉతకడంలోనే ఆయనకి ఆసక్తి.
‘టక్కరిదొంగ చక్కని చుక్క’ సినిమాలో వరుసగా నాలుగు ఫైటింగ్లు చేసి, అలసి పోకుండా ఒక చిరుతపులితో కూడా పోరాడుతాడు. ఒక్క దిక్కుమాలిన డెన్లో సత్యనారాయణ ఈ చిరుతపులిని పెంచుతూ మోసం చేసిన అనుచరులను దానికి ఆహారంగా వేస్తూ ఉంటాడు. నాయకుడిని మోసం చేయడం అనుచరుల ప్రాథమిక విధి కాబట్టి భోజనానికి లోటు లేకుండా చిరుత జీవిస్తూ వుంటుంది.
నాగేశ్వరరావుతోనే చిన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆయన ప్రేమ ఎంతకీ తెగదు. ప్రేమనగర్ సినిమాలో డబుల్ డెక్కర్ కొప్పు పెట్టుకుని వాణిశ్రీ ఏవేవో డైలాగులు చెబుతుంది కానీ ‘నిన్ను ప్రేమిస్తున్నాను బాబూ’ అని మాత్రం ఎంతకీ అనదు. పైగా ఆయన మందు ఆయన తాగి, ఘంటసాల పాటలు పాడుకుంటూ ఉంటే సహించలేక గ్లాస్ నిండా రక్తం పట్టుకుపోరుు బ్లడ్ టెస్ట్ పెడుతుంది.తలకి దెబ్బతగిలితే కుయ్యోమెుర్రోని అరుస్తాం కానీ, కుళారుులోంచి నీళ్ళు పట్టినట్టు రక్తం పట్టడం సాధ్యమా!
ఇక శోభన్బాబుని కనీసం ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ప్రేమిస్తారు. సినిమా ముగిసే వరకూ వాళ్లు త్యాగాలు చేసి కన్నీళ్లు కారుస్తూ ఎక్కడా మనకి విజిల్ వేసే అవకాశమివ్వరు. డెరైక్టర్లలో విఠలాచార్య స్టరుుల్ వేరు. కాంతారావుకి కృష్ణకుమారికి ఎక్కువ టైం ఇవ్వడు. అంతా లవ్ ఎట్ ఫస్ట్సైట్. హీరో రాక్షసులు, మహాసర్పాలతో పోరాడాలి కానీ ప్రేమని తెలపడానికి రీళ్ళు వేస్ట్ చేయకూడదని ఆయన పాలసీ. ఇక మణిరత్నం సినిమా లో అయితే హీరొ హీరొఇన్లు మాట్లాడుకోరు, వాళ్లే కాదు ఏ ఇద్దరూ మాట్లాడుకోరు.
సినిమాల్లో పార్క్ డ్యూయెట్లు చూసినప్పుడు నాకు భలే సందేహంగా వుండేది. మా కరీంనగర్ లో ఒక పార్క్ వుండేది కానీ అక్కడంతా సాధువులు, సన్నాసులే తప్ప ప్రేమికులుండేవాళ్ళు కాదు. ఒకవేళ వున్నా అక్కడ పాటలు పాడుకోవడం అసాధ్యం. నేలమీద పల్లేరు ముళ్లు, నెత్తిన రేడియో మైకు. మద్రాసులాంటి వూళ్లో పాడుకుంటారేమో అనుకునేవాణ్ని. ఆ వూరి పార్క్ చూసినప్పుడు అక్కడ కూడా సాధుమహరాజ్లే కనిపించారు.
ప్రేమంటే మల్లీశ్వరి కళ్ళలోని తడి. దేవదాసు పిరికితనాన్ని భరించలేని పార్వతి కళ్ళలోని విషాదం. ఇప్పుడొస్తున్న చాలా సినిమాల్లో హీరొఇన్లు శరీరాన్ని కదిలిస్తున్నారే తప్ప హృదయాన్ని కాదు.
(Some of this source: www.Sakshi.com)
i agree poorna cinema herione lo enti andari lonu alanti prema lopistondi ee rojululo…